: నేను అలిగానంటూ వస్తున్న వార్తలు అవాస్తవం: మోదుగుల
మంత్రి పదవి దక్కలేదని తాను అలిగినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల అన్నారు. పదవులు కోరుకోవడం తప్పుకాదని... అయితే, అవి దక్కనప్పుడు బాధపడకూడదని చెప్పారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఒక చారిత్రక ఘట్టమని తెలిపారు. ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకున్న మోదుగుల మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.