: బీఎస్ఎఫ్ విమానంలో వస్తున్న అద్వానీ, రాజ్ నాథ్
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఢిల్లీ నుంచి అతిరథమహారథులు విచ్చేస్తున్నారు. బీజేపీ అగ్రనేత అద్వానీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లు బీఎస్ఎఫ్ కు చెందిన విమానంలో విజయవాడకు వస్తున్నారు. 20 మంది కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు మరో ప్రత్యేక విమానంలో బయల్దేరారు. వీరంతా కాసేపట్లో విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.