: ఏకమైన ఎన్టీఆర్ కుటుంబం
మహానటుడు, ఆంధ్రుల అన్నగారు ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఏకమైంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం హాజరుకానుంది. ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాండ్రు, ముని మనవలు, ముని మనవరాళ్లు అంతా కలసికట్టుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. కేవలం ఎన్టీఆర్ వారసుల కోసం విమానాశ్రయంలో మూడు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ఆ బస్సుల్లో అంతా ప్రమాణ స్వీకార ప్రాంగణానికి చేరుకోనున్నారు.
ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా టీడీపీ ప్రాభవాన్ని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి కుటుంబం మొత్తం ఆసక్తిగా తిలకించనుంది. వీరినందర్నీ ఆహ్వానించిన చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు కుటుంబ వ్యవస్థకు సంబంధించి 'కలసి ఉంటే కలదు సుఖం' అంటూ ఓ గొప్ప సందేశాన్ని ఇచ్చారు.