: బాలయ్యకు స్వాగతం పలికిన జూ.ఎన్టీఆర్
సీనీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ కాసేపటి క్రితం విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టులో దిగారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం కోసం బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబానికి చెందిన వారంతా విచ్చేశారు. ఎయిర్ పోర్టులో బాలయ్యకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నారా రోహిత్ లు స్వాగతం పలికారు. వీరు ముగ్గురు ఎయిర్ పోర్టులో దాదాపు మూడు గంటల పాటు వెయిట్ చేశారు.