: కేసీఆర్ స్వరం మారిందేమిటి?


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటన విజయవంతమైందా? అంటే ఏ మూలో కాస్త అనుమానం. రాజకీయ విశ్లేషకులు మాత్రం పర్యటన సంగతి పక్కన పెడితే, కేసీఆర్ స్వరంలో మార్పు స్పష్టంగా కనబడుతోందని అంటున్నారు. రెండు రాష్ట్రాలు సమానంగా వృద్ధి సాధించాలి, సమన్వయంతో నడుచుకుందాం... అంటూ కేసీఆర్ కొత్త పల్లవి అందుకున్నారని వారు అంటున్నారు.

ఆంధ్రా పాలకుల్ని రాక్షసులుగా చిత్రీకరించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, విజయం సాధించిన తరువాత కూడా అదే తీరు ప్రదర్శించారు. కొట్లాట ముగియలేదని, చాలా విషయాల్లో తకరారు తప్పదని ఆయన నిన్నటి వరకు వ్యాఖ్యానించారు. హరీష్ రావు, కేటీఆర్ కూడా ఆంధ్రాతో నిధులు, ఉద్యోగులు, నీళ్ల విషయంలో గొడవ ముగియలేదని ప్రకటించారు.

ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, 'రెండు రాష్ట్రాలు సమన్వయంతో అభివృద్ధి సాధించాలి, తెలుగు వారమంతా సానుకూల దృక్పధంతో ముందుకెళ్దాం, చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలు' అనడాన్ని రాజకీయ విశ్లేషకులు ఆసక్తికర అంశంగా చూస్తున్నారు. కేసీఆర్ స్వరం మారిందా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం, ప్రధాని ఈయనకు ప్రత్యేకంగా ఏదైనా క్లాస్ తీసుకున్నారా? అన్న డౌటు కూడా చాలా మందికి కలుగుతోంది. ఏమైనా, గులాబీ బాస్ వైఖరి మారితే రెండు రాష్ట్రాలకు మంచిదే అని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News