: కేసీఆర్ సెక్యులర్ నేత అనిపించుకున్నారు: మహమూద్ అలీ
మైనార్టీనైన తనకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చిన టీ.సీఎం కేసీఆర్... తానొక సెక్యులర్ నేత అనిపించుకున్నారని మహమూద్ అలీ కొనియాడారు. డిప్యూటీ సీఎంగా ఈ రోజు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాత బస్తీ, కొత్త బస్తీ అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పారు. హైదరాబాదులో కబ్జాలకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.