: ఆంధ్రప్రదేశ్ లోటును కేంద్రమే భరిస్తుంది: వెంకయ్య
నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందనే తియ్యటి కబురుని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తాయన్నారు. పోలవరంపై రాద్ధాంతం చేయవద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధాని ఎక్కడన్న దానిపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి ఏడాదికి సంబంధించినంత వరకు సుమారు 15వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటును ఎదుర్కొంటోంది.