: గన్నవరం చేరుకున్న ప్రకాశ్ సింగ్ బాదల్
పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ గన్నవరం విమానాశ్రయంలో కొద్ది నిమిషాల ముందే అడుగుపెట్టారు. ప్రత్యేక విమానంలో ఆయన విచ్చేశారు. సాయంత్రం జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. బాదల్ కు యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలోని టీడీపీ నేతల బృందం ఆహ్వానం పలికింది.