: ప్రియాంకాగాంధీకి కొనసాగనున్న భద్రతా మినహాయింపులు


సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీకి విమానాశ్రయాల్లో సాధారణ తనిఖీల నుంచి మినహాయింపులు ఇకపైనా కొనసాగనున్నాయి. ప్రాణాలకు ముప్పును బట్టే ఎవరికైనా భద్రత, మినహాయింపులు ఉంటాయని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. ప్రస్తుతం ప్రియాంకాగాంధీ ఎస్పీజీ భద్రత కింద ఉన్నారు. దీంతో విమానాశ్రయాల్లో ప్రియాంకకు సాధారణ తనిఖీల నుంచి మినహాయింపులు ఉన్నాయి. ఒక వేళ ఆమె వెంట భర్త రాబర్ట్ వాద్రా, పిల్లలు వెళ్లినా ఇదే మినహాయింపులు వర్తిస్తాయి. కేంద్రంలో మోడీ సర్కారు కొలువుదీరిన నేపథ్యంలో ఈ మినహాయింపులు ఎత్తివేయనున్నారనే సమాచారం ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రముఖులకు కల్పిస్తున్న ఎస్పీజీ భ్రదతపై ఎలాంటి సమీక్ష లేదని ఆ అధికారి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News