: ఆహ్వానం అందింది: జూనియర్ ఎన్టీఆర్


కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన మనవడు, నటుడు జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ... చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందిందని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే సాయంత్రం జరిగే బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. నిమ్మకూరు ఎన్టీఆర్ జన్మస్థలమని తెలిసిన విషయం తెలిసిందే

  • Loading...

More Telugu News