: విజయవాడకు తరలివస్తున్న అతిరథ మహారథులు


టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు అతిథులుగా ఈ రోజు విజయవాడకు రానున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజె, ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్, నాగాలాండ్ సీఎం జిలియాంగ్, గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్... కేంద్ర మంత్రులు నజ్మాహెప్తుల్లా, కల్ రాజ్ మిశ్రా, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, అనంత కుమార్, ప్రకాశ్ జవదేకర్, నిర్మలా సీతారామన్, అశోక్ గజపతిరాజు హాజరు కానున్నారు. అలాగే, బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు ప్రముఖ సినీనటులు రజనీకాంత్, పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తరలి రానున్నారు.

  • Loading...

More Telugu News