: చంద్రబాబు పదేళ్లుగా ప్రతిపక్ష నేతగా పోరాడారు: సురవరం
చంద్రబాబు పదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పోరాటాన్ని సాగించారని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన విజయవంతంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బాబు, ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు సురవరం ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని తాము భావిస్తున్నామని ఆయన అన్నారు.