: లావు తగ్గించగల మహిమాన్విత మాత్ర!
ఒబేసిటీ.. స్థూలకాయం.. మనలో చాలా మందిని వెన్నాడుతున్న సమస్య. నడవాలంటే బద్ధకం... జాగింగ్ చేయాలంటే అంతకంటె చిరాకు, జిమ్‌కు వెళ్లాలంటే మన స్థోమత చాలదు.. ఇలా స్థూలకాయం తగ్గించుకునే ఒక్కొక్క మార్గానికి ఒక్కొక్క చికాకు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అందుకనే ఇలాంటి వారికి వరప్రసాదిని లాంటి ఒక మాత్రను లండన్ శాస్త్రవేత్తలు సరికొత్తగా రూపొందించారు.
స్థూలకాయం తగ్గడానికి ఈ డైట్ మాత్ర ఎంతో ఉపయోగపడుతుంది. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా ఈ మాత్రను అభివృద్ధి చేశారు. ఆకలిని నియంత్రించే నాడీకణాలపై ఈ పరిశోధనలు జరిగాయి. వాటి మీద పనిచేసేలా మాత్ర రూపొందించారు. తమ పరిశోధన వల్ల కడుపు మాడ్చుకోకుండా.. స్థూలకాయం తగ్గడం సాధ్యమవుతుందని డాక్టర్ మహమ్మద్ కె.హాజీహొస్సోని అంటున్నారు. ఈ డైట్ మాత్ర వాడితే.. ఆకలి నియంత్రణ సాధ్యమై స్థూలకాయం తగ్గుతుందంటున్నారు.