: పార్లమెంటులో అందరూ సంపన్నులే ఉంటే ప్రజలకేం న్యాయం జరుగుతుంది?: సీపీఐ నారాయణ
పార్లమెంటులో అందరూ సంపన్నులే ఉంటే ప్రజలకేం న్యాయం జరుగుతుందని సీపీఐ సీనియర్ నేత నారాయణ ప్రశ్నించారు. చట్టసభల్లో 84 శాతం మంది సంపన్నులే ఉన్నారని ఆయన అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం బడా సంస్థలకు కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. చుండూరు ఘటనలో కోర్టు తీర్పును నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందెోళనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.