: 7:20 కి ప్రారంభమై 8 గంటలకు ముగుస్తుంది: కృష్ణారావు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సాయంత్రం 7:20 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 8 గంటలకు ముగుస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు తెలిపారు. గుంటూరులోని సభా స్థలి వద్ద ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాధికారులు, పోలీసులు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం కోసం గత 15 రోజులుగా కష్టపడ్డారని అన్నారు. దేశంలో అతి ముఖ్యులైన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వస్తున్నారని, వారితో పాటు పలువురు ప్రముఖులు ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేస్తున్నారని ఆయన తెలిపారు.

వారిలో ఎవరికీ అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రోటోకాల్ వెల్లడించారు. సభా ప్రాంగణానికి ముందుగా అతిథులు వస్తారని ఆయన చెప్పారు. వారు విచ్చేసిన తరువాత గవర్నర్ వస్తారని ఆయన వెల్లడించారు. వారంతా వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయాల్సిన సభ్యులు సభా ప్రాంగణానికి చేరుకుంటారని ఆయన వెల్లడించారు.

అనంతరం సాయంత్రం 7:27 నిమిషాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని వివరించారు. అనంతరం మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేస్తుందని తెలిపారు. రాత్రి 8 గంటలకల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తవుతుందని ఆయన చెప్పారు. అతిథులు, అభిమానులు, కార్యకర్తలు ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News