: ఓ ఇంటి వాడైన క్రికెటర్ మహమ్మద్ షమీ
టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ ఓ ఇంటి వాడయ్యాడు. నిన్న (శుక్రువారం) మోరాదాబాద్ లో తన మోడల్ గాళ్ ఫ్రెండ్ హసిన్ జహన్ ను వివాహమాడాడు. గతంలో ఐపీఎల్లో ఆడుతున్న సమయంలో హసిన్ తో అతనికి పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరూ ప్రేమాయణం సాగించి ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. దీనిపై షమీ తండ్రి తౌసీఫ్ అహ్మద్ మాట్లాడుతూ, పెళ్లి నిన్న నాలుగు గంటలకు జరిగిందని, ఏడు గంటలకు రిసెప్షన్ జరిగినట్లు తెలిపాడు. కేవలం కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులే పెళ్లికి హాజరైనట్లు చెప్పాడు. కానీ, షమీ టీమ్ మేట్స్ ను పిలవలేదని అయితే, వారికోసం కోల్ కతాలో గానీ, ఢిల్లీలో గానీ ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని వివరించాడు.