: హైదరాబాదులో కార్మిక శాఖాధికారుల దాడులు


హైదరాబాదు పాతబస్తీలో కార్మిక శాఖ అధికారులు ఇవాళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లేబర్ యాక్ట్ కు విరుద్ధంగా నడుపుతోన్న సంస్థలు, దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా 20 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. వీరంతా పాతబస్తీ తో పాటు ఒడిశాకు చెందిన వారు. నిబంధనల ప్రకారం 18 సంవత్సరాల లోపు బాలలను పనిలో పెట్టుకోవడం నేరమన్న విషయం విదితమే.

  • Loading...

More Telugu News