: విజయవాడలో రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేస్తాం: సీపీఐ
విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు అక్కడ స్వర్ణ ప్యాలెస్ లో సీపీఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ నేత నారాయణ మాట్లాడుతూ, షరతులు లేకుండా రైతుల రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. చుండూరు ఘటనలో హైకోర్టు తీర్పును నిరసిస్తూ ఈ నెల 16న నిరసనలు చేస్తామన్నారు. వామపక్షాలు, దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ప్రదర్శనలు చేస్తామని చెప్పారు. కాగా, పార్లమెంటులో 84 శాతం మంది సంపన్నులే ఉండటం దురదృష్టకరమన్నారు.