: స్పీకర్ ఎన్నికపై అన్ని పార్టీలనూ సంప్రదిస్తున్నాం: హరీష్ రావు
స్పీకర్ ఎన్నికపై అన్ని పార్టీలనూ సంప్రదిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకొనేందుకు సహకరించాలని పార్టీలను కోరుతున్నామని ఆయన చెప్పారు. మండలి ఛైర్మన్ గా డిప్యూటీ ఛైర్మన్ కొనసాగుతారని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీలంతా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందని హరీష్ రావు అన్నారు. 10న మండలికి సెలవు దినమని, 11న అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుందని ఆయన తెలిపారు. త్వరలో ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.