: జగన్ అహంకారపూరితంగా వ్యవహరించారు: ధూళిపాళ్ల
ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యయుతంగానే ఆహ్వానించారని ఆ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జగన్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు స్టేట్ మేన్ అయితే జగన్ ఫ్యాక్షనిస్ట్ అని ఆరోపించారు.
బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి 3 కోట్లు కూడా ఖర్చుకాకపోయినా, 30 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ అక్రమాస్తులు 43 వేల కోట్ల రూపాయలుగా సీబీఐ గుర్తించిందని ఆయన తెలిపారు. రాష్ట్రంపై జగన్ కు ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే ఆ అక్రమార్జనను అప్పగించాలని డిమాండ్ చేశారు.