: ఆ పదవి టీఆర్ఎస్ కే ఇవ్వాలి... కాంగ్రెస్ అడగడం తగదు: ఆమోస్


తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ పదవి టీఆర్ఎస్ కే ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత కేఆర్ ఆమోస్ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మెజారిటీ ఎమ్మెల్సీలు ఉన్నారన్న నెపంతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి కావాలని అడగడం సరికాదని హితవు పలికారు. స్పీకర్, చైర్మన్ పదవులను అధికార పార్టీకి ఇవ్వాలన్న సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ పాటించాలని ఆయన అన్నారు.

తెలంగాణ ఎమ్మెల్సీలంతా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన తెలిపారు. డిప్యూటీ ఛైర్మన్ తెలంగాణ తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరిస్తారని విభజన బిల్లులోనే ఉన్నందున, ఆయనే ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News