: జూనియర్ ఎన్టీఆర్ నోరుతెరవాలి..! : కోడెల
జూనియర్ ఎన్టీఆర్ పై ఇవాళ టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ గుంటూరులో పరోక్ష విమర్శలు గుప్పించారు. కొడాలి నానికి ఎవరైతే సీటు ఇప్పించారో వాళ్లు నోరుతెరవాలంటూ డిమాండ్ చేశారు. సీటిప్పించిన వ్యక్తికి తెలియకుండానే కొడాలి నాని పార్టీనుంచి బయటకి వెళ్లారా..? అని కోడెల ప్రశ్నించారు. ఆయనకు తెలియకుండానే ఫ్లెక్సీల్లో అతని ఫొటో వాడుకుంటున్నారా..? అని జూ. ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ప్రశ్నల పరంపర సాగించారు.