: ఢిల్లీలో విద్యుత్ కోతలపై బీజేపీపై ఆప్ మండిపాటు
దేశ రాజధాని ఢిల్లీలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని... ఇలాంటి పరిస్థితుల్లో కూడా రెండు గంటపాటు కరెంట్ కోత విధిస్తున్నారని బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మండిపడింది. ఎండలు మండుతున్న సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంపై సమాధానం చెప్పాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ ట్విట్టర్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ సంక్షోభానికి వెంటనే ముగింపు పలకాలని ఆయన కోరారు.