: యూపీలో శాంతిభద్రతలను చక్కదిద్దుతాం: రాజ్ నాథ్
ఉత్తరప్రదేశ్ లో గాడితప్పిన శాంతిభద్రతలను చక్కదిద్దుతామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఇందుకు కొంత సమయం పడుతుందన్నారు. కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్ నాథ్ తన నియోజకవర్గం లక్నోకు వచ్చిన సందర్భంగా మాట్లాడారు. అఖిలేశ్ పాలనలో యూపీలో అత్యాచారాలు భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ పై విధంగా స్పందించారు. లోక్ సభ ఎన్నికల్లో తనకు అపూర్వ విజయాన్ని కట్టబెట్టినందుకు ఆయన లక్నో ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.