: ఇతర రాష్ట్రాలకు విద్యుత్తును అమ్ముకునే కుట్ర: సీపీఐ నారాయణ
మన రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు అమ్ముకునేందుకే తూర్పుగోదావరి జిల్లా దొంతపాడు ధర్మల్ విద్యుత్తు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. జిల్లాలో ధర్మల్ విద్యుత్తు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నారాయణ వారితో కలిసి ప్రాజెక్టు ఏర్పాటు చేసే భూముల్లో
ఉన్న సరిహద్దు రాళ్లను తొలగించారు. అనంతరం మాట్లాడిన ఆయన, వంద
మెగావాట్లతో ప్రాజెక్టును ప్రారంభించి 400 మెగావాట్లకు సామర్థ్యం పెంచుకునే
పన్నాగం పన్నుతున్నారన్నారు.