: ఆసుపత్రిని ఆప్ గ్రేడ్ చేస్తూ రాజయ్య తొలి సంతకం
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి మంచి రోజులు వచ్చాయి. డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని 120 పడకల ఆసుపత్రిగా మారుస్తూ ఆదేశాలు జారీ చేసే ఫైల్ పై తొలి సంతకం చేశారు. గతంలో ఈ ఆసుపత్రి 50 పడకల ఆసుపత్రి. అలాగే మెదక్ జిల్లా నుంగనూరులో 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. వైద్య రంగంలో అవినీతికి ఆస్కారం లేకుండా చూసి, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. వైద్య విద్యను ప్రోత్సహిస్తామని రాజయ్య వెల్లడించారు.