: గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల గిరులు


తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. శనివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తుల దివ్య దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రే వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. వెలుపలకు రెండు కిలోమీటర్ల వరకు భక్తులు బారులు తీరారు.

  • Loading...

More Telugu News