: టీ.టీడీఎల్పీ నేతలు వీరే... సాయంత్రం అధికారికంగా ప్రకటన
తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేతలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు. టీ.టీడీఎల్పీ ఛైర్మన్ గా ఎర్రబెల్లి దయాకరరావు, శాసనసభాపక్ష నేతగా తలసాని శ్రీనివాస్ యాదవ్ లను ఎంపిక చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రేవంత్ రెడ్డి, ఆర్.కృష్ణయ్యలు నియమితులయ్యారు. విప్ గా సండ్ర వెంకట వీరయ్యను చంద్రబాబు నియమించారు. అలాగే, మండలిలో టీడీపీ పక్ష నేతగా అరికెల నర్సారెడ్డిని నియమించారు. వీరి నియామకాలను ఈ సాయంత్రం అధికారికంగా ప్రకటిస్తారు.