: హైదరాబాద్ విచ్చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్ విచ్చేశారు. బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ఆమెను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ప్రభాకర్, ఇంద్రసేనా రెడ్డి తదితరులు ఆమెను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో నిర్మల తనదైన ముద్రను వేశారని అన్నారు. హైదరాబాదుకు విచ్చేసిన ఆమెకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామని చెప్పారు.