: తిరుమలలో ఇకపైనా మూడు క్యూలు
తిరుమలలో ఇటీవల ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చిన మూడు క్యూల విధానం ఇకపైనా కొనసాగుతుందని ఈవో గోపాల్ తెలిపారు. ఈ విధానం వల్ల భక్తులు అధిక సంఖ్యలో, సంతృప్తికరంగా స్వామిని దర్శించుకోగలుగుతున్నారని ఆయన చెప్పారు. తిరుమలకు వచ్చిన సందర్భాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులకు కూడా ప్రొటోకాల్ మర్యాదలు ఉంటాయని వెల్లడించారు. అలాగే, తెలంగాణలో ఉన్న దర్శనం బుకింగ్ కౌంటర్లను కొనసాగిస్తామని చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వారి సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.