: టీడీపీ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ వారెంట్
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఓ కేసు విషయంలో ప్రభాకర్ కోర్టుకు హాజరుకావడం లేదు. కోర్టు నోటీసులను కూడా ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆయనపై సీరియస్ అయిన భీమడోలు కోర్టు... నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది.