: కేసీఆర్ కు రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్ మెంట్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. సాయంత్రం 4.30 గంటలకు మోడీ, 6.30 గంటలకు ప్రణబ్ ముఖర్జీతో కేసీఆర్ భేటీ అవుతారు. అంతేకాకుండా ఈ రోజంతా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతూ కేసీఆర్ బిజీబిజీగా గడపనున్నారు. తెలంగాణ రాష్ర్రానికి ఆంధ్రప్రదేశ్ తరహాలో ప్రత్యేక హోదా, పోలవరం ముంపు గ్రామాలు, పలు ప్రాజెక్టులు తదితర అంశాలతో కూడిన భారీ అజెండాతో కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి అపాయింట్ మెంట్ కూడా కేసీఆర్ కోరారు. కానీ, ముందే ఖరారైన షెడ్యూల్ ప్రకారం వెంకయ్యనాయుడు హైదరాబాద్ వచ్చేశారు.

  • Loading...

More Telugu News