: బీబర్ ఇంకా చిన్నవాడే...గుణపాఠాలు నేర్చుకోవాలి: ఉషర్
13 ఏళ్లకే పాప్ సింగర్ గా కెరీర్ ఆరంభించి ఉన్నత శిఖరాలు అందుకున్న బీబర్ స్వయంకృతాపరాధాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని అమెరికన్ సింగర్ ఉషర్ హితవు పలికాడు. పలు వివాదాల్లో చిక్కుకున్న బీబర్ జరిగిన పరిణామాలపై అవగాహన పెంచుకుని, చక్కదిద్దుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. బీబర్ కేంద్రంగా వచ్చిన వివాదాలన్నింటికీ అతనే కారణమని సూచించాడు. వాటి నుంచి బయటపడటానికి బీబర్ కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదనీ, వివాదాల్లో మరింతగా కూరుకుపోతున్నాడని ఉషర్ సానుభూతి వ్యక్తం చేశాడు. తన నుంచి ఏవైనా సలహాలు అడిగితే తప్పకుండా ఇస్తానని ఉషర్ హామీ ఇచ్చాడు.