: గవర్నర్ నరసింహన్ తో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమంటూ చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించడంతో, ఆయనను బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆదివారం రాత్రి 7.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు గవర్నరుకు తెలియజేశారు.