: ఎన్నికల హమీలను నెరవేర్చకపోతే వదిలే ప్రసక్తే లేదు: కిషన్ రెడ్డి
ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే వదిలే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రైతుల రుణ మాఫీపై టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకడుగు వేస్తే ఊరుకోమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంత సమస్యలపై చర్చించేందుకు వీలుగా అసెంబ్లీని వారం రోజుల పాటు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.