: ఛీ... అన్నీ పెటాకులవుతున్నాయి... ఇక పెళ్లి చేసుకుంటే ఒట్టు!


వరుసగా రెండు పెళ్లిళ్లు పెటాకులయ్యాయి. పోన్లే, ఏదో అవగాహన లోపం అని సరిపెట్టుకుందామంటే మూడో పెళ్లి కూడా పెటాకులయింది. దీంతో హాలీవుడ్ నటి కేటీ ప్రైస్ కు జ్ఞానోదయం అయినట్టుంది. అందుకే 'ఇక జన్మలో పెళ్లి చేసుకుంటే ఒట్టు' అంటూ నిట్టూరుస్తోంది. గత నెల కైరన్ హేలర్ తో కేటీ ప్రైస్ విడిపోయింది. తాము విడిపోయి నెల అవుతున్నా సంతోషంగా ఉన్నామని కేటీ ప్రైస్ తెలిపింది.

తాను మళ్లీ పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని, మరోసారి పెళ్లవుతుందని కూడా తాను భావించట్లేదని ఆమె తెలిపింది. కేటీ ప్రైస్ తొలుత ఆస్ట్రేలియన్ పాప్ స్టార్ పీటర్ ఆండ్రీని పెళ్లి చేసుకుంది. ఓ బాబు పుట్టిన తరువాత, తామిద్దరికీ జోడీ సరిపోదని నిర్ధారించుకుని విడిపోయారు.

తరువాత కేజ్ ఫైటర్ అలెక్స్ రీడ్ ను పెళ్లి చేసుకుంది. వీరి దాంపత్యానికి గుర్తుగా ఓ బిడ్డ పుట్టింది. కొంత కాలం ఆనందంగా గడిపినా మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి కైరన్ హేలర్ ను పెళ్లాడి ఓ బాబును కన్న కేటీ, గర్భవతిగా ఉండగానే విడిపోయింది. దీంతో కేటీ ప్రైస్ కి జూనియర్, ప్రిన్సెస్ టియామీ, హార్వీ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

  • Loading...

More Telugu News