: కేసీఆర్ ను అభినందించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి


తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభినందించారు. పట్టం కట్టిన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. రైతు రుణమాఫీ సహా అన్ని ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలోని తాగునీరు, సాగునీరు సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. అలాగే ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News