: ఎవరెస్ట్ ను అధిరోహించిన పూర్ణ, ఆనంద్ లకు మోడీ అభినందనలు
అతి పిన్న వయసులోనే ఎవరెస్టును అధిరోహించి రికార్డు నెలకొల్పిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్ కుమార్ లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ఢిల్లీలో మోడీని కలసిన వారిద్దరినీ శాలువా, జ్ఞాపికలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా మోడీ కోరారు. పూర్ణ, ఆనంద్ లను సన్మానించిన ఫోటోను పీఎంవో ప్రధాని కార్యాలయం అధికారులు ట్విట్టర్ లో పోస్టు చేశారు.