: కోదండరాంకు తృటిలో తప్పిన ప్రమాదం
తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాంకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి కోదండరామ్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ఘట్ కేసర్ నుంచి బయల్దేరి హైదరాబాదులోని ఈసీఐఎల్ కు వస్తుండగా, రంగారెడ్డి జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది.