: ఢిల్లీ బయల్దేరిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రెండు రోజుల పాటు గులాబీ బాస్ ఢిల్లీలోనే ఉంటారు. తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ అవుతారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వీలైనంత వరకు నిధులను రాబట్టే లక్ష్యంతోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు.