: రాజ్యసభ సభ్యుడవుతున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్
కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవుతున్నారు. మోడీ మంత్రివర్గంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా నియమితులైన జవదేకర్ ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడిగా లేరు. దాంతో ఆయనను మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నుకోనున్నారు. నిబంధనల ప్రకారం, ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరునెలల్లోగా లోక్ సభ లేదా రాజ్యసభలో సభ్యుడిగా ఎన్నిక కావాలన్న సంగతి తెలిసిందే.