: చెవి కమ్మల కోసం మహిళ గొంతు కోశారు!
వెండి కడియాల కోసం ఓ మహిళను నరికి చంపిన దారుణ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. దేవరకద్ర మండలం వెంకటాయపల్లిలో ఆరు బయట నిద్రిస్తున్న పోలమ్మ అనే మహిళ గొంతు కోసిన దుండగులు చెవికమ్మలు తీసుకున్నారు. వెండి కడియాల కోసం రెండు కాళ్లను నరికేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.