: బాబు ఎందుకు మమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు..? : చిరంజీవి
చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడం వల్లే గత ఎన్నికల్లో తాము అధికారంలోకి రాలేకపోయామని చంద్రబాబు పదేపదే వ్యాఖ్యానించడాన్ని చిరంజీవి తప్పుబట్టారు. కేవలం అధికారం కోసమే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉండగా చంద్రబాబుకి ప్రజల కష్టాలు కనిపించలేదన్నారు. అసలు ప్రజలపై చంద్రబాబుకు ప్రేమే లేదని చెప్పుకొచ్చారు.
ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చిరంజీవి ప్రసంగించారు. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఎడారిలో ఒయాసిస్సే అన్నారు. తమ విన్నపాలు పరిగణలోకి తీసుకునే ముఖ్యమంత్రి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించారని, దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుందని చిరు అభిప్రాయపడ్డారు.
అనంతరం జిల్లాలోని దువ్వ, వరిగేడు, అత్తిలి, రేలంగి, తణుకు గ్రామాల్లో 56.34 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది కార్యక్రమాలను చిరంజీవి ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.