: మెదక్ జిల్లాలో రుణమాఫీ ఎఫెక్ట్... గుండెపోటుతో రైతు మృతి!
మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం కాశీపూర్ లో భద్రన్న అనే రైతు గుండెపోటుతో మరణించాడు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాకుండా... కాలపరిమితితో కూడిన రుణమాఫీని అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈ ప్రకటనతో రైతు భద్రన్న తీవ్ర ఆవేదనకు లోనై... గుండెపోటుతో మరణించాడు. రుణమాఫీ కావడం లేదనే బాధతోనే భద్రయ్యకు గుండెపోటు వచ్చిందని బంధువులు ఆరోపిస్తున్నారు. భద్రయ్య మరణంతో అతని కుటంబసభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.