: కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన రైతన్నలు


రుణమాఫీ కాలపరిమితిపై తెలంగాణ రైతన్నలు భగ్గుమంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పిట్లం మండలం తిమ్మానగర్ లో రైతులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు రాస్తారోకో చేపట్టారు. రైతులందరికీ కాలపరిమితితో సంబంధం లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ ను నెరవేర్చకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే ముప్కాల్ వద్ద జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. బాల్కొండ మండలం బస్వాపూర్ జాతీయ రహదారిపై, జుక్కల్ మండలం కేమ్రాజ్ కల్లాలిలో రైతులు రాస్తారోకో చేపట్టారు. ఫలితంగా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News