: టీ.టీడీఎల్పీ సమావేశం నేడు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఈ రోజు జరగనుంది. 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో టీ.టీడీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. అంతేకాకుండా ఫ్లోర్ లీడర్లు, విప్ లను కూడా ఎన్నుకుంటారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సరళి, ఫలితాలపై సమీక్షించనున్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన మార్గాలపై కూడా చర్చిస్తారు.