: నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులను రేపు కలవనున్నారు. ఎల్లుండి (ఆదివారం) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన తొలిసారి ఢిల్లీ వెళ్తున్నారు. తెలంగాణకు సంబంధించి శాఖల వారిగా తయారు చేయించిన నివేదికలను కేసీఆర్ ప్రధాని, కేంద్ర మంత్రులకు ఇవ్వనున్నారు. పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించిన నివేదికను మోడీకి సమర్పించనున్నారు. ఆదివారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వస్తారు.