: కొడుకుల కోసం ఎన్టీఆర్ ఏనాడూ ప్రాకులాడలేదు : బాలకృష్ణ


ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం... అనే నందమూరి తారకరామారావు భావించారని, ఆ దిశగానే పనిచేశారని ప్రముఖ సినీనటుడు, టీడీపీనేత బాలకృష్ణ అన్నారు. కొందరు రాజకీయనేతల్లా కొడుకులను అందలమెక్కించాలని, ఉన్నత పదవుల్లో చూడాలని అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని ఆయన తెలిపారు. కొంచెం సేపటి క్రితం ఆయన కృష్ణాజిల్లా తిరువూరులో ప్రసంగించారు.

పాలనలో సింహభాగాన్ని తమ ఫ్యామిలీని పైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించి లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని, ఆయన వైఎస్ పాలనాకాలాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. వేలకోట్లు వెచ్చించి చేపట్టిన జలయజ్ఞం పనులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయని వ్యాఖ్యానించారు.

ఇంకా... స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆశయాల కోసమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలయ్య తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ వ్యవస్థ తిరోగమనానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డే కారణమన్నారు. కాంగ్రెస్ అధికారం... రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పాలనాకాలంలో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని బాలకృష్ణ వెల్లడించారు.

  • Loading...

More Telugu News