: భోపాల్ ట్రాఫిక్ పోలీసుల 'తీపి' ప్రచారం


భోపాల్ ట్రాఫిక్ పోలీసులు 'తీపి' ప్రచారం ప్రారంభించారు. 'చెప్పిన మాట వింటే చాక్లెట్ ఇస్తా' అంటూ చిన్నపిల్లను ఆకట్టుకునే పద్దతిలో 'చట్టం పాటిస్తే చాక్లెట్ ఇస్తా'మంటున్నారు. భోపాల్ లో రోడ్డెక్కిన ద్విచక్రవాహనాలను పోలీసులు ఆపారు. దీంతో హెల్మెట్ పెట్టుకున్న వాహనదారులు అన్నీ సక్రమంగానే ఉన్నాయంటూ సమాధానం చెబుతుండగానే పోలీసులు చాక్లెట్స్ తీసి వారి నోరు తీపి చేశారు. హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డెక్కిన వాహనదారులందర్నీ ఓ గదిలోకి తీసుకెళ్లి దారుణమైన రోడ్డు ప్రమాదాల విజువల్స్ చూపించి సేఫ్టీపై అవగాహన కల్పించారు.

  • Loading...

More Telugu News