: తప్పు తెలుసుకున్న అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తప్పు తెలుసుకున్నారు. దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అత్యాచార ఘటనలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కన్నావుజ్ లో పీపుల్ ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అత్యాచార ఘటనల్లో నిందితులను అరెస్టు చేయడంలో విఫలమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.